పేరుపాలెం బీచ్‌లో విషాదం

5చూసినవారు
పేరుపాలెం బీచ్‌లో విషాదం
ఆదివారం కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌కు చెందిన ఉమామహేశ్వరరావు(26) స్నేహితులతో కలిసి పేరుపాలెం బీచ్‌కు విహారయాత్రకు వచ్చాడు. సముద్రంలో స్నానానికి దిగినప్పుడు అలల ఉద్ధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినా విఫలమయ్యారు. కొద్దిసేపటికే యువకుడి మృతదేహం సముద్రపు ఒడ్డుకు కొట్టుకువచ్చింది.