
వేగవరం: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
వేగవరం సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదంలో వర్జీనియా పొగాకు రైతు మువ్వ సాంబశివరావు మృతి చెందారు. టి. నర్సాపురం మండలం అప్పలరాజుగూడెం కు చెందిన ఆయన జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రానికి వచ్చి తిరిగి వస్తుండగా, మరో మోటార్ సైకిల్ ఆయన బైక్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో అతని వెనుక ఉన్న మరో వ్యక్తి, ఢీకొన్న వ్యక్తి కూడా గాయపడ్డారు.





































