
నరసాపురం: నలుగురు సైబర్ నేరగాళ్లు అరెస్టు
మొగల్తూరు సబ్ రిజిస్టర్ను ఏసీబీ పేరుతో బెదిరించి రూ. 2 లక్షలు దోచుకున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు నరసాపురం డీఎస్పీ శ్రీవేద మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. నిందితుల నుంచి రూ. 85,000 నగదు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మిగిలిన నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని డీఎస్పీ పేర్కొన్నారు.




































