
పాలకొల్లు: డబల్ లైన్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన
పాలకొల్లు నియోజకవర్గంలో సోమవారం అభివృద్ధి పనులకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రూ. 12 కోట్లతో నర్సాపురం ప్రధాన కాలువపై డబల్ లైన్ బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.





































