మహిళను మోసం చేసి ఏటీఎంలో 40వేలు డ్రా చేసిన కేటుగాడు

3030చూసినవారు
మొగల్తూరు మండలం శేరేపాలెంకు చెందిన లావణ్య అనే మహిళ ఈ నెల 10న నగదు కోసం ఏటీఎం సెంటర్‌కు వెళ్లారు. అక్కడ అపరిచిత వ్యక్తి ఆమెను మాటల్లో పెట్టి, పిన్‌తో సహా ఏటీఎం కార్డును మార్చి పరారయ్యాడు. అనంతరం ఆమె ఖాతా నుంచి రూ. 40 వేలు నగదు డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో, లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్