తణుకులో ఆదివారం కలెక్టర్‌గా చదలవాడ నాగరాణి బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. MRO కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో MRO అశోక్ వర్మ, మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.