తాడేపల్లిగూడెం పట్టణంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా మారింది. ప్రతి రెండు వీధుల్లోనూ పదుల సంఖ్యలో కుక్కలు తిరుగుతున్నాయి. రాత్రి సమయాల్లో పాదచారులపై, మహిళలు, చిన్నారులపై దాడులు చేస్తున్నాయని, కరుస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజూ కుక్కకాటు బాధితులు వస్తున్నారని వైద్యులు తెలిపారు. వీటికి బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేసి, పట్టణానికి దూరంగా అడవి ప్రాంతంలో వదిలివేయాలని ప్రజలు కోరుతున్నారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.