
పాలిటెక్నిక్ విద్యార్థిపై దాడి.. ఆరుగురు సస్పెండ్
AP: తిరుపతి జిల్లా నారాయణవనంలోని సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీలో ఓ విద్యార్థిపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పాలిటెక్నిక్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని ఈ నెల 20న సీనియర్ విద్యార్థులు దారుణంగా కొట్టారు. ఓ అమ్మాయి విషయంలో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ నెల 25న పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరుగురు స్టూడెంట్ను కాలేజీ యాజమాన్యం తాజాగా సస్పెండ్ చేసింది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.




