అత్తిలి మండల పోలీసులు నిర్మానుష్య ప్రదేశాలలో అసాంఘిక కార్యకలాపాలను నివారించేందుకు శనివారం వినూత్నంగా డ్రోన్ల ద్వారా గస్తీ చేపట్టారు. ప్రజల శాంతిభద్రతలకు భంగం కలగకుండా అందరూ సహకరించాలని పోలీసులు సూచించారు. ఈ చర్యల ద్వారా అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా పోలీసులు పని చేస్తున్నారు.