తణుకులో గోహత్య జరుగుతున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. తణుకు లేహ్యం ఫ్యాక్టరీలో వధించిన 11 కంటైనర్ల పశు మాంసాన్ని విశాఖలో కేంద్ర నిఘా అధికారులు స్వాధీనం చేసుకున్నారని, వీటిలో మూడు కంటైనర్లలో గో మాంసం ఉందని నిర్ధారించారని ఆయన శుక్రవారం తణుకులో మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. సనాతన ధర్మం అంటూ ప్రగల్భాలు పలుకుతున్న కూటమి నేతలు ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.