మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తణుకు పట్టణంలో ఈ నెల 28న నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో పోస్టర్ల ఆవిష్కరణ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టి, ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన తెలిపిన అనంతరం, రాష్ట్ర వ్యాప్తంగా గవర్నర్‌కు వినతి పత్రం అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.