కాళ్లకూరు వేంకటేశ్వర స్వామి దేవాలయంలో భాద్రపద పౌర్ణమి వేడుకలు ఘనంగా

3చూసినవారు
కాళ్లకూరు వేంకటేశ్వర స్వామి దేవాలయంలో భాద్రపద పౌర్ణమి వేడుకలు ఘనంగా
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం కాళ్లకూరులోని స్వయంభూ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో భాద్రపద పౌర్ణమి సందర్భంగా అష్టోత్తర శత కలశార్చన, సప్తనది జలాభిషేకం, శాంతి కళ్యాణ మహోత్సవము ఘనంగా నిర్వహించారు. శనివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కైంకర్యాలలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం కార్యనిర్వహణాధికారి, పాలకమండలి సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్