పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మండలం ఆరేడులో బుధవారం రెవిన్యూ గ్రామ సభ జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ మంతెన రామ్ ప్రసాద్ రాజు మాట్లాడుతూ ఇప్పటికే రీ సర్వే పూర్తయిన గ్రామాలకు ఎలాంటి తప్పులు లేని పట్టాదార్ పాస్ పుస్తకాలను అందించామని తెలిపారు. రీ సర్వే ప్రక్రియలో రైతులు సహకరించాలని ఆయన కోరారు. ఈ సభలో అధికారులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.