ఆకివీడు రూరల్ బ్యాంక్ చైర్మన్ గా మోటుపల్లి రామవరప్రసాద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడిగా 30 ఏళ్లకు పైగా సేవలందించిన రామవరప్రసాద్, ఆకివీడు మార్కెట్ కమిటీ చైర్మన్ గా కూడా పనిచేశారు. సీనియర్ నాయకుడైన ఆయన బ్యాంక్ చైర్మన్ గా ఎన్నికవ్వడంపై కూటమి నాయకులు, స్నేహితులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. వీరంతా ఆయనను బోకేలు, పూలదండలు, శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.