శ్రీ పోలేరమ్మ అమ్మవారికి క్షత్రీయ వదిన మరదళ్లు ఆషాడం సారె సమర్పణ

4చూసినవారు
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వాండ్రంగ్రామంలోని శ్రీ పోలేరమ్మ అమ్మవారికి బుధవారం క్షత్రీయ వదిన మరదళ్లు ఆషాడం సారెను సమర్పించారు. అమ్మవారు గాజుల అలంకరణలో దర్శనమిచ్చారు. గాజులు స్త్రీ సౌభాగ్యానికి ప్రతీక అని, ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే మహిళలకు సౌభాగ్యం, దీర్ఘసుమంగళి ప్రాప్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నసమారాధన కార్యక్రమం చేపట్టారు.

సంబంధిత పోస్ట్