మంత్రి నారా లోకేశ్ ఈ నెల 6న ఉండి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10. 30 గంటలకు ఉండి జడ్పీ ఉన్నత పాఠశాలలో నూతన భవనాన్ని, క్రీడా కోర్టులను ప్రారంభిస్తారు. అనంతరం భీమవరం పట్టణ ప్రవేశద్వారం వద్ద 11 గంటలకు రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 11. 30 గంటలకు ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఓపెన్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో, సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారని అధికారులు శనివారం తెలిపారు.