పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట విఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకునే వరకు పోరాడుతామని సంఘం మండల అధ్యక్షులు బి కన్నయ్యరాజు తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, విఆర్ఏలు సోమవారం కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ ఆందోళన గత 13 రోజులుగా కొనసాగుతోంది. నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపిన వీఆర్ఏలు తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.