పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు వ్యవసాయ పరిశోధన సంస్థ అధికారులు పడమటిపాలెం వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. ఆచంట మండలం పడమటి పాలెం రైతు నెక్కంటి రామకృష్ణ తన ఎకరం పొలంలో సాగు చేసిన ఎంటియు 1443 రకం వరిపై అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ రకం సార్వాలో 140 రోజులు, దాల్వాలో 125 రోజుల్లో కోతకు వస్తుందని, ఎకరాకు 50 నుంచి 60 బస్తాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.