శుక్రవారం ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పితాణి సత్యనారాయణ తన కుటుంబ సమేతంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, ఆలయ అధికారులు ఆయనను ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.