
భార్యను దారుణంగా హత్య చేసిన భర్త
కాకినాడ జిల్లా యానాంలో భార్య దీనాను భర్త నాని హత్య చేశాడు. వీరిద్దరి మధ్య గత నాలుగు నెలలుగా బల్లవారి వీధిలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతురాలి వంటిపై తీవ్ర గాయాలను గుర్తించారు. పరారీలో ఉన్న భర్తపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




