పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం లో అరెళ్ల బాలికపై కిరాణా షాపు యజమాని అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తినుబండారాల కోసం షాపుకు వెళ్ళిన బాలికపై ఈ ఘోరం జరిగిందని చిన్నారి తల్లిదండ్రులకు తెలిపింది. తల్లిదండ్రులు, ఐసిడిఎస్ సిబ్బంది మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికను వైద్య పరీక్ష నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.