సిద్ధాంతంలో ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

5చూసినవారు
ఈనెల 9వ తేదీన పెనుగొండ మండలం సిద్ధాంతంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడానికి ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు రానున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయన సిద్ధాంతంలోనే ఉంటారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి, ఎస్బి నయిమ్ అస్మి, ఇతర అధికారులతో కలిసి ఎలిఫడ్ స్థలాన్ని పరిశీలించారు. పాస్ పుస్తకాల పంపిణీ తర్వాత రైతులతో ముఖాముఖి, అనంతరం 56 అంశాలపై వివిధ శాఖల అధికారుల పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అన్ని శాఖల అధికారులు తాజా గణాంకాలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.