పెనుగొండలో దట్టమైన పొగమంచు: జనజీవనం స్తంభించింది

8చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ పట్టణంలో శనివారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కురిసింది. దీనివల్ల వాహనదారులు, ప్రజలు, రైతులు, ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దారి కనిపించక పోవడంతో కొన్ని వాహనాలు రోడ్ల పక్కన నిలిచిపోయాయి. ద్వారకాతిరుమల, వాడపల్లి పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. అధికారులు వాహనాలను జాగ్రత్తగా నడపాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్