ఆచంటలో డీజిల్ కొరత: రైతులకు ఎమ్మెల్యే పితాని కీలక సూచనలు

784చూసినవారు
ఆచంటలో డీజిల్ కొరత: రైతులకు ఎమ్మెల్యే పితాని కీలక సూచనలు
ఆచంట నియోజకవర్గంలో డీజిల్ కొరత ఏర్పడటంతో, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ రైతులకు ముఖ్య సూచనలు చేశారు. రైతులు సమీపంలోని రైతు సేవా కేంద్రంలో వివరాలు నమోదు చేసి కూపన్ పొందాలని, ఆ కూపన్‌తో వ్యవసాయ అధికారుల సూచించిన పెట్రోల్ బంకుల్లో డీజిల్ పొందవచ్చని తెలిపారు. డీజిల్ కొరతపై ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. రైతులు నియమాలు పాటించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్