సోమవారం మార్టేరు వ్యవసాయ పరిశోధనా సంస్థలో గోదావరి మరియు విస్తరణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయ పరిశోధన సంచాలకులు సి. హెచ్. శ్రీనివాసరావు మాట్లాడుతూ, మార్టేరు నుంచి విడుదలైన వరి రకాలు దేశంలోని 13 రాష్ట్రాల్లో సాగవుతుండటం గర్వకారణమని తెలిపారు. మధ్యస్థ కాలపరిమితి గల సన్నగింజ రకాల అభివృద్ధి పరిశోధనా సంస్థ బాధ్యత అని ఆయన నొక్కి చెప్పారు.