సమగ్ర శిక్ష ఉద్యోగులకు వీడ్కోలు - నక్కా నరేష్ విజ్ఞప్తి

710చూసినవారు
సమగ్ర శిక్ష ఉద్యోగులకు వీడ్కోలు - నక్కా నరేష్ విజ్ఞప్తి
పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 15 ఏళ్లుగా సమగ్ర శిక్షలో సేవలందించిన సీఆర్ఎం టీచర్లకు భావోద్వేగ వీడ్కోలు పలికారు. జిల్లా సంఘం అధ్యక్షుడు నక్కా నరేష్ కుమార్ మాట్లాడుతూ, కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లభించకపోవడం బాధాకరమని, అన్ని విభాగాల్లో ఇదే పరిస్థితి ఉందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించడంతో పాటు పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని ఆయన కోరారు. పాలకొల్లు మండలానికి చెందిన పి. రాజరాజేశ్వరిని రిటైర్మెంట్ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుమల నేతాజీ, ఎస్ నాగార్జున, ఏ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్