పశ్చిమ గోదావరి జిల్లాలో 99 టీవీ నూతన సంవత్సర క్యాలెండర్‌ను మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన 99 టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాపరిపాలనలోని అంశాలను ప్రజలకు తెలియజేయడం, సామాజిక రంగాల్లో ప్రజల అవసరాలను ప్రభుత్వానికి చేరవేయడం, ప్రజాహిత సమాచారంతో అవగాహన కల్పించే దిశగా ఛానల్ పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు.