పెనుగొండ పట్టణంలో ఆదివారం సాయంత్రం 4:30 గంటల నుంచి వర్షం దంచి కొట్టింది. దీంతో ప్రజలు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్ర ఎండ వేడిమితో అల్లాడిన ప్రజలకు ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఊపిరి పీల్చుకున్నారు. వ్యాపారాలు జరిగే సమయంలో ఒక్కసారిగా వర్షం రావడంతో సంచార వ్యాపారులు తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని అంటున్నారు.