
అమానుషం.. వృద్ధుడిపై కర్రలతో దాడి(వీడియో)
వెస్ట్ బ్యాంక్లో ముసుగు ధరించిన ఇజ్రాయెల్ స్థిరనివాసులు, 67 ఏళ్ల పాలస్తీనియన్ బాసిమ్ యాసిన్ పై అమానుషంగా దాడి చేశారు. చెవిటివాడు కావడంతో హెచ్చరికలు వినలేకపోయిన యాసిన్ ను కర్రలతో కొట్టి, తల వెంబడి తన్నడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ అక్కడ స్థావరాలను నిర్మిస్తుండటంతో ఇటువంటి దాడులు పెరిగిపోతున్నాయని వార్తలొస్తున్నాయి. ఈ దాడిని ప్రధాని నెతన్యాహు ఖండించినప్పటికీ, పాలస్తీనియన్లకు ఇవి నిత్యకృత్యంగా మారాయి.




