ప.గో: అతుక్కులేని జాతీయ జెండా.. లోకేశ్ అభినందన..!

1చూసినవారు
ప.గో: అతుక్కులేని జాతీయ జెండా.. లోకేశ్ అభినందన..!
ఆచంట మండలం వేమవరానికి చెందిన చేనేత కార్మికుడు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ బుధవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో తాను అతుకులు, కుట్లు లేకుండా రూపొందించిన అరుదైన జాతీయ జెండాను మంత్రికి చూపి, దాని ప్రాముఖ్యాన్ని వివరించారు. ఈ అరుదైన జెండాను ఢిల్లీలోని ఎర్రకోటపై ఎగురవేసేలా ప్రభుత్వం తరఫున కృషి చేయాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా లోకేశ్‌ ఆయనను అభినందించారు.