పెనుగొండలోని గాంధీ బొమ్మల సెంటర్, మునసబు గారి వీధిలో మానసిక సమస్యతో బాధపడుతున్న ఒక వ్యక్తి ప్రవర్తన ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. అతను నగ్నంగా, అర్ధనగ్నంగా తిరుగుతూ, దారిన పోయే వారిని అసభ్య పదజాలంతో వేధిస్తున్నాడు. ఇంటి తలుపులు తెరిచి ఉంటే చొరబడి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బాధితులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు స్పందించి అతనికి వైద్య సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.