పెనుమంట్ర మండలం మల్లిపూడి గ్రామంలోని శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో ఆదివారం కార్తీక ద్వాదశి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమ పూజలు జరిగాయి. మల్లిపూడి, పరిసర గ్రామాలతో పాటు దూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు.