
పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే గుర్తింపు: చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం కొత్త కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను మనసు విప్పి మాట్లాడుతున్నానని, పార్టీ కోసం పనిచేసిన వారికే గుర్తింపు ఉంటుందని, మొదటి నుంచి ఉన్నవారికి గౌరవం దక్కాలని, ఎవరి అనుమతి అవసరం లేకుండా పనిచేసిన వారికే పదవులు వస్తాయని స్పష్టం చేశారు. ఎవరు బాగా పనిచేస్తే వారికే ప్రాధాన్యత ఇస్తానని, పార్టీ ఎవరిని నిలబెట్టినా వారికి అండగా నిలబడి పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.




