బూరుగుపల్లి జాతరలో జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన ఘటనపై యలమంచిలి ఎస్సై గురవయ్యను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు విషయంలో, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలడంతో ఆయనపై వేటు పడింది. శాంతి భద్రతల వైఫల్యంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ సస్పెన్షన్ చోటుచేసుకుంది. అధికారులు ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.