
నేడు జిల్లాలో సామూహిక గృహప్రవేశాలు
ప. గో. జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన 100 గృహాల ప్రవేశాలు బుధవారం జరగనున్నాయి. జిల్లాకు కేటాయించిన 6,770 గృహాల్లో 6,600 ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయి గృహప్రవేశాలు జరిగాయి. మిగిలిన 100 ఇళ్ల నిర్మాణం పూర్తయి సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఈ గృహప్రవేశాలు అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు.








































