అదనపు కట్నం వేధింపులు: కోమటిగుంటలో వివాహిత నిరసన

4చూసినవారు
అదనపు కట్నం వేధింపులు: కోమటిగుంటలో వివాహిత నిరసన
కాళ్ల మండలం సీసలి గ్రామానికి చెందిన ఓ గృహిణి, తన భర్త తనకు కావాలని కోరుతూ అత్తవారింటి వద్ద ఆందోళనకు దిగింది. కోమటిగుంట గ్రామానికి చెందిన తన భర్త తరపున అత్తమామలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, తల్లి ఆరోగ్యం బాగాలేక ఇంటికి వెళ్లినప్పుడు విడాకుల నోటీసులు పంపారని ఆమె ఆరోపించింది. ఈ ఘటనపై ఆమె న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేసింది.