
ఈడీ దాడులు ..9 వ అంతస్థ నుంచి క్యాష్ బ్యాగుల విసిరేశారు
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సన్నిహితుల ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించింది. మొహాలి, చండీగఢ్, ఖరార్లోని వెస్ట్రన్ టవర్స్ అపార్ట్మెంట్లో ఈడీ బృందం చేరుకోగానే, 9వ అంతస్తు నుంచి నగదు బ్యాగులను విసిరివేశారు. రెండు బ్యాగుల్లో దాదాపు 20 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కిందపడిన కరెన్సీ కట్టలను అధికారులు ఏరేస్తున్న వీడియోలు కలకలం సృష్టించాయి.




