
టెన్త్లో ఫెయిల్.. ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మండలం కిరికెరలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన మనస్థాపంతో 15 ఏళ్ల విద్యార్థిని హంస శ్రీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.




