ఆక్వా రైతులు సమస్యలను పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలి

4చూసినవారు
ఆక్వా రైతులు సమస్యలను పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలి
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం మాట్లాడుతూ, నాణ్యమైన ఉత్పత్తులు, శాస్త్రీయ పద్ధతులు, పర్యావరణ పరిరక్షణతో కూడిన ఆక్వా సాగుపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో ఆక్వా రంగం రైతులు, ప్రతినిధులు, ఎగుమతిదారులతో జరిగిన సమీక్షలో, ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు గ్రహించి, పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆమె ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్