పింఛన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి

3చూసినవారు
పింఛన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి
భీమవరం పట్టణం 16వ వార్డు అయ్యవారి వీధిలో సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి, పింఛన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా, ఆరోగ్యం ఎలా ఉంది, పిల్లలు ఏం చేస్తున్నారు, ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు అందుతున్నాయా, సిబ్బంది గౌరవప్రదంగా ఇస్తున్నారా వంటి వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని, పింఛన్ సొమ్మును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్