భీమవరం: యనమదుర్రు కాలువలోకి దూకిన యువకుడు

5చూసినవారు
భీమవరం: యనమదుర్రు కాలువలోకి దూకిన యువకుడు
భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్దగల ఫుట్పాత్ వంతెన పైనుంచి 20 ఏళ్ల యువకుడు శుక్రవారం యనమదుర్రు కాలువలోకి దూకినట్లు సమాచారం. సుమారు ఉదయం 10.25 నిమిషాల ప్రాంతంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. యువకుడు తన బ్యాగ్, పాదరక్షలను బ్రిడ్జిపై వదిలి కాలువలోకి దూకినట్లు తెలిపారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించగా, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.