భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్దగల ఫుట్‌పాత్ వంతెనపై నుంచి 20 ఏళ్ల యువకుడు శుక్రవారం ఉదయం సుమారు 10.25 గంటలకు యనమదుర్రు కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. స్థానికుల కథనం ప్రకారం, యువకుడు తన బ్యాగ్, పాదరక్షలను బ్రిడ్జిపై విడిచి కాలువలోకి దూకినట్లు తెలిపారు. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.