భీమవరం పట్టణంలోని స్థానిక వన్ టౌన్‌లోని టౌన్ హాల్ గెస్ట్ హౌస్‌పై శుక్రవారం రాత్రి పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 14,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ సీఐ ఎం. నాగరాజు తెలిపారు. ఈ ఘటన పట్టణంలో కలకలం రేపింది.