భీమవరం: కొత్త కారు నుంచి పొగలు

6చూసినవారు
భీమవరం: కొత్త కారు నుంచి పొగలు
భీమవరంలో ఓ షోరూం వద్ద మంగళవారం గందరగోళం నెలకొంది. పట్టణానికి చెందిన వేగి వాణిశ్రీ టాటా నెక్సన్ కారును కొనుగోలు చేయగా.. డెలివరీ సమయంలో సైలెన్సర్ నుంచి పొగ, నీరు వచ్చాయి. లక్షలు వెచ్చించి కొన్న కొత్త కారుకు ఇలా జరగడమేమిటని ఆమె, బంధువులు మేనేజర్ రమేశ్ను నిలదీశారు. దీనిపై షోరూం నిర్వాహకుల నుంచి సరైన స్పందన లేదని, తనకు న్యాయం చేయాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.