గురువారం, కలెక్టర్ నాగరాణి పశ్చిమగోదావరి జిల్లాలో తుఫాను కారణంగా జరిగిన ప్రాథమిక నష్టాన్ని వివరించారు. ఈ తుఫాను తాకిడికి 91 గ్రామాలు ప్రభావితమయ్యాయని, 13 గ్రామాలు, 6 పట్టణాలు నీట మునిగాయని తెలిపారు. మొత్తం 13,431.83 హెక్టార్లలో వ్యవసాయం, 299.87 హెక్టార్లలో ఉద్యానవన పంటలు, 93 ఇళ్లు దెబ్బతిన్నాయని ఆమె పేర్కొన్నారు.