భీమవరం: పట్టపగలే హత్యాయత్నానికి అసలు కారణమిదే..!

11చూసినవారు
భీమవరం: పట్టపగలే హత్యాయత్నానికి అసలు కారణమిదే..!
భీమవరంలో రౌడీ షీటర్ రౌతుల రఘుపై జరిగిన హత్యాయత్నం కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆధిపత్య పోరు, పాత కక్షల నేపథ్యంలో గత నెల 27న ఈ దాడి జరిగినట్లు డీఎస్పీ రఘువీర్ విష్ణు వెల్లడించారు. నిందితుల నుంచి కారు, ఏడు కత్తులు, రెండు ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రఘును హతమార్చాలని కుట్ర పన్నిన ఈ గ్యాంగ్‌ను సోమవారం అర్ధరాత్రి పోలీసులు పట్టుకున్నారు.