భీమవరం: కలెక్టర్ ను అభినందించిన కేంద్రమంత్రి

84చూసినవారు
భీమవరం: కలెక్టర్ ను అభినందించిన కేంద్రమంత్రి
ప. గో. జిల్లా కలెక్టర్ నాగరాణి మానవతా సేవల్లో చూపిన విశేష కృషికి గుర్తింపుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్రస్థాయి అవార్డును ఇటీవల గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా భీమవరం కలెక్టరేట్లో నాగరాణిని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ మంగళవారం కలిసి అభినందించి సత్కరించారు. ఈ అవార్డు ఆమె సేవాభావానికి, మానవతా కార్యక్రమాలపైన ఉన్న నిబద్ధతకు గుర్తింపుగా నిలుస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్