మేడే వేడుకలు విజయవంతం చేయాలి సిఐటియు

2చూసినవారు
మేడే వేడుకలు విజయవంతం చేయాలి సిఐటియు
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వసుదేవరావు, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను రద్దు చేసే వరకు కార్మికులు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. భీమవరంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో మేడే గోడ పోస్టర్లను ఆయన విడుదల చేశారు. మే డే స్ఫూర్తితో సంఘటితంగా పోరాడాలని, మే 1న మే డే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, జెండా ఆవిష్కరణలు, ర్యాలీలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగస్తులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్