వసతి గృహాల్లో సోలార్ లైట్లు.... పరిశీలించిన కలెక్టర్

4చూసినవారు
వసతి గృహాల్లో సోలార్ లైట్లు.... పరిశీలించిన కలెక్టర్
భీమవరం, బుధవారం: జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం పట్టణంలోని సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ కాలేజీ గర్ల్స్ వసతి గృహాన్ని సందర్శించారు. ఇటీవల ఆమె చొరవతో ఏర్పాటు చేసిన 10 సోలార్ లాంపుల పనితీరును పరిశీలించి, విద్యార్థినులతో మాట్లాడారు. సోలార్ లైటింగ్ వ్యవస్థతో వెలుతురు సరిపడా ఉందని, ఎలాంటి ఇబ్బందులు లేవని విద్యార్థినులు తెలిపారు. అవసరమైన మార్పులుంటే వెంటనే తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్