సమయానికి పింఛన్లు అందించాలి కలెక్టర్

1చూసినవారు
సమయానికి పింఛన్లు అందించాలి కలెక్టర్
జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు సామాజిక భద్రతను బలోపేతం చేసే దిశగా మే 1వ తేదీన విస్తృత స్థాయిలో పింఛన్ల పంపిణీ చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మొత్తం 2, 21, 843 మంది లబ్ధిదారులకు రూ. 96. 23 కోట్ల విలువైన సామాజిక పింఛన్లను పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పథకం కింద ప్రతినెల మాదిరిగానే ఈసారి కూడా పింఛన్లను సమయానికి అందించేందుకు సచివాలయం సిబ్బందికి అవసరమైన ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మే 1వ తేదీ ఉదయం నుంచే సచివాలయం సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా పింఛన్లు అందజేయాలని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్